హైదరాబాద్ లోని మై హోం విహంగ వద్ద విద్యార్థి నాయకులతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పై బీఆర్ఎస్, బీజేపీ నేతలు లేని ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. కంచె గచ్చిబౌలి లోని సర్వే 25లో 2004 లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్టు HCU రిజిస్ట్రార్ సంతకం చేశారని గుర్తు చేశారు.
ఇందుకు బదులుగా ప్రభుత్వం తిరిగి 397 ఎకరాలు ఇస్తున్నట్టు రిజిస్ట్రార్ సంతకం చేశారని గుర్తు చేశారు. ఇందుకు బదులుగా ప్రభుత్వం తిరిగి 397 ఎకరాలు ఇస్తున్నట్టు సంతకం చేసిందని అన్నారు. 534 ఎకరాల్లో 400 ఎకరాలు IMG భారత్ కి 120 ఎకరాలు ఉద్యోగ సంఘాలకు కేటాయించారని పేర్కొన్నారు. IMG భారత్ ఒప్పందం ప్రకారం.. వ్యవహరించలేదు. దీంతో ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది. 400 ఎకరాలు ప్రభుత్వ భూమిగా కోర్టుల్లో కోట్లాది ప్రభుత్వం సాధించిందని అన్నారు.