Jagananna Arogya Suraksha : నేటి నుంచి రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం కానుంది. ప్రజలకు ఉచిత వైద్యం అందించే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ఇవాళ ప్రారంభం కానుంది. నేడు గ్రామీణ ప్రాంతాల్లో, రేపటి నుంచి పట్టణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమం ఆరు నెలల పాటు సాగనుండగా, మొత్తం 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తిచేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ప్రతి ఇంటిని రెండుసార్లు సందర్శిస్తారు. కాగా, జనవరి 3వ తేదీన అంటే రేపు సీఎం వైఎస్ జగన్ కాకినాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్…కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు.