ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద బుధవారం అంటే నేడు.. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఇస్తోంది. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లి స్తోంది.
అక్టోబర్ – డిసెంబర్ 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లు నేడు సచివాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
జగనన్న విద్యా దీవెన పథకం కింద.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది ప్రభుత్వం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరు జమ చేస్తోంది సర్కార్.