ఏపీ రైతులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. నెలలోపే పంట నష్ట సాయం రిలీజ్ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు సీఎం జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండని కోరారు. గతంలో పేపర్లో ఫోటోలు వస్తే చాలని అనుకునేవారు, కానీ ఇప్పుడలా కాదు, వారం రోజులు జిల్లా కలెక్టర్లకు సమయం ఇచ్చామని వివరించారు సీఎం జగన్.
వరద బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించాం, నేనే స్వయంగా వచ్చి వరద బాధితుల్ని కలుస్తానని చెప్పా, రెండు రోజులుగా వరద బాధితులతో మాట్లాడుతున్నాను, వరద సాయం అందని ఇళ్లు లేదని తెలిపారు సీఎం జగన్. పంట నష్టం జరిగితే ఆర్బీకేల్లో నమోదు చేసుకోవాలని కోరారు. రెండు రోజుల్లో ఆర్బీకే కేంద్రాల్లో వరద బాధితుల జాబితా, నెలలోపే పంట నష్ట సాయం, గతంలో ఎప్పుడూ ఇలా పారదర్శకంగా వేగంగా అందించలేదన్నారు సీఎం జగన్.