నాకు టికెట్ ఇవ్వకపోతే ముస్లింలు ఉరివేసుకుంటారు – జలీల్ ఖాన్

-

నాకు టికెట్ ఇవ్వకపోతే ముస్లింలు ఉరివేసుకుంటారని హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. విజయవాడ వెస్ట్ టికెట్ నాదే. అందరూ టికెట్ అడుగుతారు. కానీ గెలిచే స్తోమత ఉండాలి.. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.


బీకాంలో ఫిజిక్స్ కామెంట్ తో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. టీడీపీ ముస్లిం మైనారిటీ నేతల్లో బాగా పేరున్న ఈయన….కొన్నేళ్ల నుంచి అంత యాక్టివ్ గా లేరు. 2019 ఎన్నికల్లో జలీల్ పక్కకు తప్పుకొని తన కూతురు షబానాకు టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలైంది షబానా.

అయితే ఈసారి ఎన్నికల్లో తనే పోటీ చేయాలని అనుకుంటున్నారు జలీల్ ఖాన్. కానీ పొత్తులో భాగంగా జనసేన కోసం టీడీపీ ఈ సీటును త్యాగం చేయొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాకు టికెట్ ఇవ్వకపోతే ముస్లింలు ఉరివేసుకుంటారని హాట్ కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news