నేను చంద్రబాబుకే ఓటు వేసానని కుమారి ఆంటీ పేర్కొన్నారు. తాను చిన్నప్పటి నుంచి చంద్రబాబుకే ఓటు వేశానంటూ కుమారి ఆంటీ చేసిన వాక్యాలతో టీడీపీ-వైసీపీ మధ్య వార్ మొదలైంది. సంక్షేమం ఎవరు చేస్తారో, అభివృద్ధి ఎవరికి చేతనవుతుందో ప్రజలకు తెలుసు.
నువ్వు హ్యాపీగా దిగిపో జగన్’ అని టీడీపీ ట్వీట్ చేసింది. ‘మాకు ఓటు వేయనివారైనా సరే…. సంక్షేమ పథకాలకు అర్హత ఉంటే అందజేస్తాం. మాకు తెలిసిన రాజకీయం ఇదే. జగన్ నాయకత్వానికి గర్వపడుతున్నాం’ అని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.
కాగా, సోషల్ మీడియా ద్వారా తన ఫుడ్ సెంటర్ వైరల్ గా మారడంతో కుమార్ ఆంటీ బిజినెస్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వేల సంఖ్యల్లో సోషల్ మీడియా ఈ ఆంటీ ఫుడ్ తినాలని బంజారాహిల్స్ వస్తుండడంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ అధికారులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్ ను తొలగించాలని నిర్ణయించారు. పోలీసులు అక్కడికి చేరుకొని కుమార్ ఆంటీకి తమ పని తాము చూసుకుంటామని ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఫుడ్ సెంటర్ నిలిపివేస్తున్నామని ఆమెకు తెలిపారు.