ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి. స్కిల్ స్కామ్ కేసులో సెంట్రల్ జైలులో కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ తరువాత టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చినట్టు అయింది. విజయవాడ వేదికగా జరిగిన వైసీపీ ప్రతినిధుల సమావేశంలో ఎన్నికల పొత్తులు, పవన్ కళ్యాణ్ పై పంచ్ లు విసిరారు సీఎం జగన్.
రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది సున్నానే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒకడు 15 ఏళ్లయింది పార్టీ పెట్టి.. ఇప్పటికీ ఒక నియోజకవర్గంలో నాయకులు లేరు. గ్రామాల్లో జెండా మోసే కార్యకర్త లేడు.. జీవితం అంతా చంద్రబాబును భుజాలపై మోయడానికే సరిపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతిలో భాగంగా భాగస్వామి దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు గుప్పించారు సీఎం జగన్. బిస్కేట్లు, చాక్లెట్లు పంచినట్టు దత్తపుత్రుడికి తమ అనుచరులకు ప్రభుత్వ సొమ్ము పంచిపెట్టారని విమర్శించారు.