ఏపీ రైతులకు శుభవార్త..ఆహార పదార్ధాల ఎగుమతులపై వర్క్ షాప్

-

ఏపీ రైతులకు శుభవార్త. వ్యవసాయం, హార్టికల్చర్, ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్ధాల ఎగుమతులలో ఏపీ కి అవకాశాలపై వర్క్ షాప్ నిర్వహించింది జగన్‌ సర్కార్‌. ఈ వర్క్ షాప్ ను ప్రారంభించారు వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా రైతుకు లాభం చేకూర్చడానికి ప్రభుత్వం తీసుకుంది ఈ ప్రత్యేక కార్యక్రమం.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… మాట్లాడుతూ.. రైతు అసలైన శాస్త్రవేత్త.. రైతు మాత్రమే ప్రయోగాలు చేయడానికి అర్హుడన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రైతుకు ఎలా తీసుకురావాలి అనే లక్ష్యంతో ఈ వర్క్ షాపు అని.. వ్యవసాయం రైతుకు లాభసాటిగా మార్చాలని సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

భగవంతుడికి ప్రసాదం పెట్టాలన్నా రైతు పండించినదే పెట్టాలని.. రైతులకు మరింత వెసులుబాటు కలిగించేలా కార్యక్రమాలు చేయాలని సీఎం ఆదేశించారని గుర్తు చేశారు. మల్టీ పర్పస్ గోడౌన్ లు వస్తున్నాయని.. సొసైటీలు, మార్కెట్ యార్డులు రాజకీయ పునరావాసాలుగా మారిపోకుండా డిజిటల్ విధానం తెచ్చామన్నారు. వంద దేశాలకు పైగా మన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే అవకాశం ఉందని.. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన యూనివర్సల్ గా మారడానికి కారణం మన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రమేనని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news