చంద్రబాబు సుదీర్ఘంగా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుపై దిశా నిర్దేశం చేస్తారని అనుకున్నా. కానీ ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా నెరవేర్చడం కుదరదని కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబుపరోక్షంగా చెప్పారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ చేసారు. కలెక్టర్ల కాన్ఫిరెన్స్ మొక్కుబడిగా జరిగింది.
ఇక రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారింది. హత్యలు, అనైతిక కార్యక్రమాల్లో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. ఉచిత ఇసుక లో ఉచితం అనే పదం మాయం అయింది. టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. రూ.14 లక్షల కోట్లు అప్పున్నా సరే.. హామీలన్నిటిని అమలు చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. చివరికి రూ.7 లక్షల 48 వేల కోట్లు అప్పు ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యేలు చెప్పినట్టే కలెక్టర్లు వినాలని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు. జగన్ బొమ్మ ఉందని విద్యాదీవెన కిట్స్ కూడా పంపిణీ చెయ్యలేదు. అలాగే సంపద సృష్టిస్తానని.. ప్రజల సంపదను దోచుకుంటున్నాడు. ప్రయివేటికరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు అని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.