రాష్ట్రంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సోమవారం ఉదయం నాందేడ్ – ఆకోలా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఫ్లోర్ బండల లోడుతో హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్తున్న లారీ ఆందోల్ మండలం సంగుపెట్ వద్ద గల జాతీయ రహదారిపై గల వంతెనపై నుంచి అదుపుతప్పి కింద పడిపోయింది.
ఈ ఘటనలో లారీ డ్రైవర్ షాకిర్, క్లినర్ ధర్మేందర్ సింగ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.డ్రైవర్ షాకిర్ సుమారు 3 గంటల పాటు ముందు భాగంలోని క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. తనను కాపాడాలని పెద్దపెద్దగా కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను హోంగార్డు శ్రీ శైలం చాకచక్యంగా రక్షించాడు.అనంతరం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.