గోవర్థన్ రెడ్డిని అడిగిమరీ వాయించుకున్న సోమిరెడ్డి!!

-

మనగురించి మనకంటే ఎక్కువగా ఎవరికితెలుస్తుంది? రాజకీయాల్లో ఉన్నవారిగురించి అయితే వారి గురించి వారితోపాటుగా జనాలకూ బాగానే తెలుస్తుంది! ఈ విషయంలో ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి గురించి ఎవరికి తెలియదు? ప్రజాక్షేత్రంలో ఆయనపై ప్రజలకున్న నమ్మకం, గౌరవం తెలియంది ఎవరికి? ఈ విషయాలు అడిగిమరీ గోవర్థన్ రెడ్డితో గాలి తీయించేసుకున్నారు సోమిరెడ్డి!

ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు రెండేసి పంటలు పండించిన సంగతి తెలిసిందే!! దీంతో నెల్లూరు జిల్లా చరిత్రలోనే మొదటిసారి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కోసం రూ. 793 కోట్లు రైతులకు చెల్లించామని.. రెండో పంటకు సంబంధించి ఇప్పటికే 2 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని గోవర్థన్ రెడ్డి ఘనంగా ప్రకటించారు! ఈ క్రమంలో మైకందుకున్న సోమిరెడ్డి… టీడీపీ హయాంలో ధాన్యం కొనుగోలు పక్కాగా జరిగిందని.. వైకాపా ప్రభుత్వంలో అది లేదని చెప్పుకొచ్చారు!

దీంతో మైకందుకున్న గోవర్థన్ రెడ్డి… నెల్లూరు జిల్లాలో మిల్లర్లతో కుమ్మకై కమిషన్ లకు కక్కుర్తిపడి పనిచేసిన తమరా తమపై విమర్శలు చేసేది అంటూ… సోంఇరెడ్డిపై ఫైరయ్యారు! గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా మిల్లర్లతో కుమ్మకై ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. టీడీపీ హయాంలో ఎంత కొనుగోలు చేశారో రికార్డులు చూడాలని.. లెక్కలు తెలియకుండా మాట్లాడొద్దని.. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఇన్ ‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా మోసం చేశారని.. వితౌట్ గ్యాప్ వాయించేశారు గోవర్థన్ రెడ్డి!

అనంతరం ప్రజల్లో సోమిరెడ్డికి ఉన్న విలువ, నమ్మకంపై మాట్లాడిన గోవర్థన్ రెడ్డి… అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా అయిదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి దగ్గర తాము నేర్చుకోవాలా? అని ఎద్దేవా చేశారు! దీంతో అవసరమా సోమిరెడ్డి… మనం ఏమిటో మనకు, జనాలకూ కూడా తెలిసిన తర్వాత.. ఇలా అడిగిమరీ వాయించుకోవడం అవసరమా అంటూ ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారంట!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version