Kakara Nooka Raju : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక చవితి పండుగ రోజున మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు కి చెందిన మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు అనారోగ్యం కారణంగా తెల్లవారుజామున మృతి చెందారు.
విశాఖ లో ఒమిని ఆర్.కె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాకర కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. పాయకరావుపేట నియోజకవర్గం కు మూడు సార్లు కాకర నూకరాజు ఎమ్మెల్యే గా తమ సేవలు అందించారు. ఆయన చివరి చూపు కోసం అభిమానులు తమ ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు మృతి నేపథ్యం లో… ఏపీలోని రాజకీయ నాయకులు, ఆయన సన్నిహితులు.. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి.