కాకినాడ రూరల్ ఎంపీపీ పదవీ జనసేన హస్తగతం అయింది. ఇప్పటివరకు కాకినాడ రూరల్ ఎంపీపీ వైఎస్సార్ కాంగ్రెస్ చేతిలో ఉంది. అయితే 18 స్థానాలకు మూడు స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఉండగా.. తాజాగా ఏడుగురు వైసీపీ సభ్యులు జనసేనలో చేరిపోయారు. ఎన్నికల సందర్భంగా వీరంతా లంబసింగి శిబిరంలో ఉన్నారు. గురువారం ఎంపీపీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లంబసింగి నుంచి ఈ సభ్యులు నేరుగా గురువారం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఎంపీపీని ఎన్నుకున్నారు.
తొలి నుంచి ఆ కుర్చీ తమదేనని జనసేన ధీమా వ్యక్తం చేస్తోంది. కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికను 8 మంది ఎంపీటీసీలు బహిష్కరించారు. వైసీపీ నుంచి జనసేనలోకి ఏడుగురు చేశారు. 10 మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్యే నానాజీ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ నందిపాటి అనంతలక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నియ్యారు.