క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చాగల్లులో జరిగే క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు మంగళవారం ద్విచక్ర వాహనం పై తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంధ్రవరానికి వస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు రాజమండ్రి దివాన్ చెరువు-కొంతమూరు జాతీయ రహదారి పై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని గుర్తించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతి పై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు చనిపోలేదని.. ఆయన హత్యకు గురయ్యారని పేర్కొంటూ క్రైస్తవ సంఘాల నాయకులు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ అంతిమయాత్ర సికింద్రాబాద్ లో అంతమ యాత్ర జరిగింది. ఈ సందర్భంగా భార్య జెస్సికా స్పందించారు. భావోద్వేగానికి గురయ్యారు. ఇంత మంది నా భర్త కోసం ఉన్నారు. నేను ఎవరినైనా పగ తీర్చుకోను. అందరినీ క్షమించాను. నా భర్త చాలా మంచివాడు.. తనను హత్య చేసిన వాళ్లను కూడా క్షమించే అంత మంచి వాడు. నా భర్త బాటలోనే మేము నడుస్తామని తెలిపారు.