వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవనున్నారు – రఘురామ

-

విలన్ రియాక్షన్ తో పోలిస్తే, హీరో రియాక్షన్ బలంగానే ఉంటుందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై తమ పార్టీ కాపు, కాపుయేతర నాయకులు చేసిన విమర్శలపై ఆయన పంచ్ లు బలంగానే విసురుతారని, అవి పేలుతాయి కూడా అని అన్నారురఘురామకృష్ణ రాజు. పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ గ్యాప్ లోనే రాష్ట్రంలో పర్యటిస్తారని తమ పార్టీ నాయకులు విమర్శించేవారని, ఇప్పుడు 20 రోజులపాటు ప్రజా క్షేత్రంలో జనసేనాని వారాహి వాహనంపై పర్యటించాలని నిర్ణయించడంతో తమ పార్టీ నాయకుల నోర్లు మూతబడడం… వారికి మూత్రం రావడం ఖాయమని అన్నారు.

చేతిలో నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ, ఆయన తొలి విడత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 20 రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించుకున్నారని, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి రెండు రోజులకు ఒకసారి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని అన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆశీర్వాదంతో యాత్రను ప్రారంభించి, భీమవరం భీమేశ్వరుని, మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని, తన యాత్రను ముగించనున్నారని తెలిపారు. అయితే ఈ సందర్భంగా భీమవరం నుంచి తనకు కొంత మంది ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ గారి యాత్ర ముగింపు సమావేశానికి హాజరవుతారా? రాజు గారు… అని ప్రశ్నించారని, అయితే తాను ఇతర పార్టీ సభ్యుడనని, అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించే హక్కును ఈ పాలకుల వల్ల కోల్పోయానని వారికి తెలిపానని అన్నారు.

భీమవరం నుంచి మళ్లీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని కోరాల్సిందిగా వారికి సూచించానని, అప్పటికి తాను ఈ పార్టీలో ఉండనని, మంచి మనిషిని ఓడించామనే బాధ ప్రజల్లో ఉందని, ఆయన్ని ఈసారి 60 వేల పైచిలుకు మెజారిటీతోనే ప్రజలు గెలిపిస్తారని అన్నారు. రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం పోరాడుతూ, ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించి, ప్రజలను కష్టాలనుంచి కాపాడాలని ఆరాటపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని గత ఎన్నికల్లో ఓడించిన దానికి పాప ప్రక్షాళన చేసుకునేందుకు ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు భావిస్తున్నట్లుగా రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news