ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటు చేసిన రా.. కదలి రా.. సభలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్ అర్జునుడు కాదు.. అక్రమార్జనుడు అన్నారు. ఒకప్పుడు నేను ఇసుక ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఇసుకను అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. జగన్ దెబ్బకు పరిశ్రమలు పారిపోయాయి. పోలవరం పూర్తి అయితే రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందన్నారు. చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది అన్నారు.
సూపర్ 6లో రైతును రాజు చేస్తాం. ఒక్క పక్క సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తాం.. మరో పక్క అభివృద్ధి కల్పిస్తాను. నేను ప్రభుత్వ ఉద్యోగాలిస్తే.. జగన్ ఫిష్ మార్కెట్ లో ఉద్యోగాలిచ్చాడు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పోయాయి. కానీ డ్వాక్రా సంఘాలను కదపలేకపోయారన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కానీ జగన్ మాట్లాడలేదు. పులివెందుల సీటు కూడా ఈసారి మనం గెలవాలి. జగన్ ని ఓడించడానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు చంద్రబాబు. మైనింగ్, ఇసుక బటన్లు నొక్కి జగన్ వందల కోట్లు నొక్కాడని చంద్రబాబు పేర్కొన్నారు.