ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.15 వేలు కాదు రూ.21 వేలు.. పీఎఫ్ లిమిట్ పెంచారా..?

-

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విషయంలో కేంద్రం ఇంకో నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ పరిధిలోని ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని చూస్తోంది. ప్రస్తుతం పీఎఫ్ వేతన పరిమితి 15000 ఉంది. దానిని 21 వేలకు పెంచాలని కేంద్రం చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లిమిట్ పెంచాలని కొన్నేళ్లుగా ఉద్యోగుల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటిదాకా కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. డిమాండ్లు పెరుగుతున్న క్రమంలో ఆర్థిక కేంద్రం చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ లెక్కించడానికి ఈపీఎఫ్ వేతన పరిమితిని 15 వేల నుంచి 21 వేలకు పెంచాలని డిమాండ్లను పరిశీలించిన కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎన్నికల ముందు వార్తను కూడా వచ్చాయి.

కొత్త ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ లెక్కింపు ఎలా ఉంటుందన్నది చూడాలి. ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ 15 వేల బేసిక్ వేతనంపై లెక్కిస్తారు. గరిష్టంగా రూ.1250 అవుతుంది వేతన పరిమితి రూ.2100 పెరిగితే అప్పుడు నెలకు రూ.1749 వరకు చెల్లించవచ్చు. వేతన పరిమితిని పెంచడం వలన రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ మొత్తంలో పెన్షన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version