ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై నిషేధం

-

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. విద్యార్థులు పాఠశాలకు మొబైల్స్ తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి ఫోన్లు తేవడంపై ఆంక్షలు విధించింది. ఉపాధ్యాయులు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించింది.

బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాల, ఇతర వర్గాలతో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కూడా ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news