జోగి రమేష్‌ కేసులో ట్విస్ట్..పరారీలో ఉన్న ఇద్దరు అధికారులు !

-

జోగి రమేష్‌ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జోగి ఫ్యామిలీ అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జోగి ఫ్యామిలీ అగ్రిగోల్డ్ భూముల కేసులో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు, మండల సర్వేయర్ రమేష్ కీలకంగా వ్యవహరించారట. సీఐడీ, ఏసీబీ నమోదు చేసిన రెండు కేసుల్లో నిందితులుగా ఉన్నారట సబ్ రిజిస్ట్రార్, మండల సర్వేయర్.

Key issues in ACB investigation in Jogi Family Agrigold land case

రిజిస్ట్రార్ నాగేశ్వర రావు, జోగి బాబాయ్ వేంకటేశ్వర రావు పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తహసిల్దార్ జాహ్నవికి చెప్పకుండా ఆన్లైన్ లో అప్లోడ్ చేసి కథ నడిపారట మండల సర్వేయర్ రమేష్. అటు ఈ కేసుల్లో సంతకం చేశారు గ్రామ సర్వేయర్ దేదీప్య. అటు సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు రిజిస్ట్రేషన్ చేశారట. దీంతో ఆ ముగ్గురినీ అరెస్ట్ చేయటానికి సిద్ధమవుతోంది ఏసీబీ. కానీ వాళ్లందరూ పరారీలో ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version