ఏపీ ప్రజలకు అలర్ట్… వైయస్సార్ చేయూత పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. అర్హులైన వారు వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా… కొత్త, పాత లబ్ధిదారుల ధ్రువీకరణకు ఈ నెల 11 వరకు గడువు ఉంది.
13 నుంచి 20 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ పథకం కింద 26.39 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 18, 750 చొప్పున సీఎం జగన్ ఈనెలఖరున జమ చేసే అవకాశం ఉంది.ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బుడగ జంగాలు, వాల్మీకి, బెంతో ఒరియా, ఏ నేటి కొండా సామాజిక వర్గాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోయినా వైయస్సార్ చేయూత పథకానికి అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. దరఖాస్తు తో సెల్ఫ్ డిక్లరేషన్ పెడితే చాలని స్పష్టం చేసింది. క్యాస్ట్ సర్టిఫికెట్ జారీలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.