మాజీమంత్రి, వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీ పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. శుక్రవారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని రాజకీయ వ్యభిచారి అని, పిచ్చికుక్క అని మండిపడ్డారు. స్వార్థం కోసం కొడాలి నాని ఏమైనా చేస్తారని.. చివరికి జగన్ కి కూడా ద్రోహం చేస్తారని అన్నారు.
కొడాలి నాని, వంశీ బుక్కాపకీర్లని ఎద్దేవా చేశారు. పేర్ని నాని బందరు పిచ్చోడని ఏద్దేవా చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీకి డిపాజిట్ కూడా రానివ్వకుండా టిడిపి దెబ్బ ఏంటో చూపిస్తామన్నారు. ఓటమి భయం వైసీపీ నేతల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావడం చూసి వైసిపి నేతల్లో భయం పట్టుకుందన్నారు. తమపై కేసులు పెడితే భయపడే పరిస్థితి లేదన్నారు.