వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని ఇద్దరూ చాలా రోజుల తర్వాత కలిశారు. దాదాపు 137 రోజులపాటు వల్లభనేని వంశీ జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. కిడ్నా ప్ అలాగే భూకబ్జా అంటూ అనేక రకాల కేసులు వల్లభనేని వంశీ పై ఉన్నాయి. ఈ తరుణంలోనే జైలు పాలయ్యారు వల్లభనేని వంశీ. అయితే రెండు రోజుల కిందట జైలు నుంచి రిలీజ్ అయిన వల్లభనేని వంశీ వరుసగా వైసిపి నేతలను కలుస్తున్నారు.

మొదట వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి.. కేసు వివరాలను ఆయనకు చెప్పారు వల్లభనేని వంశీ. ఇక తాజాగా వల్లభనేని వంశీ ఇంటికి కొడాలి నాని అలాగే పేర్ని నాని ఇద్దరు వెళ్లారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీని పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే.. దాదాపు గంట పాటు వీళ్ళ సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.