గులాబీ పార్టీ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు ఊహించని షాక్ తగిలింది. ఓటర్ లిస్టులో ఆయన పేరును అధికారులు తాజాగా తొలగించడం జరిగింది. చెన్నమనేని రమేష్ పేరు తొలగిస్తున్నట్లు ఆయన ఇంటికి అధికారులు నోటీసులు కూడా అందించేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. గతంలో కూడా ఓటర్ జాబితాలో పేరు తొలగింపు పై అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆ నోటీసులకు చెన్నమనేని రమేష్ సమాధానం ఇవ్వలేదు. ఈ తరుణంలో ఆయన పేరును ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తూ.. ఎన్నికల అధికారులు తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు ఊహించని షాక్ తగిలినట్లు అయింది. ఇది ఇలా ఉండగా… వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం ఉందని ఓటు కూడా తేల్చేసింది.