కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టీడీపీ కీలక పదవి

-

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టింది టీడీపీ పార్టీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమించారు ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను నెల్లూరు రూరల్ లో అట్టహాసంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. నెల్లూరు రూరల్ లో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news