హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్ కృషి ఎనలేనిది – మంత్రి కొట్టు

-

ఏపీ సీఎం జగన్‌ పై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్య నారాయణ ప్రసంశల జల్లు కురిపించారు. హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్ కృషి ఎనలేనిది అని వివరించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇవాళ అసెంబ్లీలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… 2006 లో ధూపదీప నైవేద్యం ప్రవేశ పెట్టింది YS రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో 2006 లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 వేల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న 1,401 దేవాలయాలకు సాయం చేశారని గుర్తు చేశారు.

బాబు హయాంలో కొత్తగా కేవలం 150 ఆలయాలను చేర్చారని వెల్లడించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.30 వేల వార్షికాదాయ పరిమితిని రూ.లక్షకు పెంచిందన్నారు. 2,978 దేవాలయాలకు అదనంగా లబ్ధి చేకూరిందని చెప్పారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ధూపదీప నైవేద్యం క్రింద 4,750 ఆలయాలకు లబ్ది చేకూరిందని.. ప్రస్తుతం 4,750 దేవాలయాలకు ఏటా రూ.28.50 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news