ఎవరూ తిరగని సమయంలో కొండ అంచు విరిగి పడిందని ఇంద్రకీలాద్రి సంఘటనపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. నిన్న సాయంత్రం ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్ వద్ద కొండ చరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే విజయవాడ దుర్గాఘాట్ ఎదురుగా కొండచరియలు విరిగిపడ్డ స్థలాన్ని పరిశీలించారు దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ, అధికారులు.

ఈ సందర్భంగా ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ తిరగని సమయంలో కొండ అంచు విరిగి పడిందని.. వానలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ. దేవాదాయ శాఖ కమీషనర్, ఈఓ, ఇంజనీర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించామని చెప్పారు. ఐఐటీ మద్రాస్ జియాలజిష్టు తో మాట్లాడాము… ఫోటోలు పంపించాం… తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ.