చంద్రయాన్-3తో జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్.. ఆ తర్వాత సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను నింగిలోకి పంపింది. ఇక ఇప్పుడు సముద్రం సంగతి చూద్దామని సముద్రయాన్ పేరిట సాగర అన్వేషణకు సమాయత్తమవుతోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి ‘మత్స్య-6000’ తుది మెరుగులు దిద్దుకుంటోంది.
మత్స్య-6000’ సబ్‌మెరైన్ ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ఇది సముద్రగర్భ అన్వేషణకు తోడ్పడే మానవసహిత జలాంతర్గామి అని ఆయన చెప్పారు. దీన్ని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేసింది.
మత్స్య-6000 ప్రత్యేకతలు ఇవే
- ఇది ప్రారంభమైతే భారత మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కనుంది.
- ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు.
- సాగర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి అది ఉపయోగపడుతుంది.
- తొలుత ఇది 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు సమాచారం.
Next is "Samudrayaan"
This is 'MATSYA 6000' submersible under construction at National Institute of Ocean Technology at Chennai. India’s first manned Deep Ocean Mission ‘Samudrayaan’ plans to send 3 humans in 6-km ocean depth in a submersible, to study the deep sea resources and… pic.twitter.com/aHuR56esi7— Kiren Rijiju (@KirenRijiju) September 11, 2023