గత కొన్ని రోజులుగా ఏపీలో అఘోరి హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఓ ఘటనతో వార్తలో నిలిస్తున్న అఘోరి నిన్న చేసిన పని మాత్రం కొంత టెన్షన్ కు ధరి తీసింది. అయితే నిన్న శ్రీకాళహస్తికి వచ్చిన అఘోరిని.. ఆలయంలోకి వెళ్లనివ్వకపోవడంతో అక్కడ సిబ్బందితో గొడవకు దిగింది. ఆ తర్వాత కాసేపటికి లోపలి వెళ్లనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
అయితే అఘోరి చేష్టలతో అప్రమత్తం అయిన శ్రీకాళహస్తి పోలీసులు ఆమెను నిన్న సత్యవేడు నియోజకవర్గం నుండి తమిళనాడు సరిహద్దుకి తరలించారు. కానీ ఈరోజు మళ్ళీ తిరిగి
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటుకొని వరదయ్యపాలెం మండలం మీదుగా శ్రీకాళహస్తికి పోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అఘోరి. బుచ్చినాయుడు కండ్రిగ దాటుకొని శ్రీకాళహస్తి వైపు కారులో వెళ్తుంది అఘోరి. అయితే అఘోరిని ఈసారి ఆలయం వద్దకు రాణిస్తారా లేదా దారిలోనే పోలీసులు ఆపేస్తారా అనేది మాత్రం తెలియడం లేదు.