వైసీపీ నాయకులు నందమూరి లక్ష్మీ పార్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూ.ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ, తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు టీడీపీలోకి జూ.ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదన్నారు.. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని తెలిపారు.
జగన్‌లా జనంలో ఉంటే ఐదేళ్ల తర్వాత జూ.ఎన్టీఆర్‌కు అవకాశం ఉంటుదని…ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందన్నారు లక్ష్మీ పార్వతి. దీనిని దృష్టిలో పెట్టుకుని… జూ.ఎన్టీఆర్ ముందుకు సాగాలన్నారు వైసీపీ నాయకులు నందమూరి లక్ష్మీ పార్వతి.
లోకేష్ స్థాయి ఏంటో అందరికీ తెలుసు అని.. ఏడో తరగతి ఫెయిల్ అయిన వెధవ, మూర్ఖుడని నిప్పులు చెరిగారు. లోకేష్, చంద్రబాబు మాట్లాడుతున్న మాటల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తోందన్నారు. మా నాయకుడు ఒక్క సైగ చేస్తే చాలు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.