రాష్ట్రపతి భవన్ నుంచి నారా లోకేష్ కు లేఖ వచ్చింది. రాష్ట్రపతికి లోకేష్ రాసిన లేఖపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…రాష్ట్రపతి భవన్ నుంచి నారా లోకేష్ కు లేఖ విడుదల చేశారు. నారా లోకేష్ రాసిన లేఖలోని అంశాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు లేఖలో ఈ మేరకు పేర్కొంది రాజ్ భవన్.

చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని.. రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరుతూ గతంలో లేఖ రాశారు నారా లోకేష్. అయితే.. ఈ లేఖ నేపథ్యంలోనే…రాష్ట్రపతి భవన్ నుంచి నారా లోకేష్ కు లేఖ వచ్చింది. కాగా, చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.