మద్యం దుకాణాల లైసెన్స్‌లతో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తోందని లెక్కలు చెబుతున్నాయి. మద్యం దుకాణాల లైసెన్స్ కోసం బుధవారం రాత్రి వరకు 57,709 దరఖాస్తులు స్వీకరించారు. ఈ తరుణంలోనే… రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ప్రభుత్వానికి రూ.1154.18 కోట్ల ఆదాయం ఏపీ ప్రభుత్వానికి సమకూరిందట.
ఇక నేడు, రేపు కూడా అవకాశం ఉండడంతో మరో 40 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 2 దుకాణాలకు అత్యధికంగా 217 దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4,420, ఏలూరులో 3,843, విజయనగరంలో 3,701 దరఖాస్తులు ఏపీ సర్కార్ వచ్చాయి.