ఇవాళ ఏపీ కేబినేట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంటుంది. ఈ సందర్భంగాఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంపై చర్చించనుంది చంద్రబాబు కేబినేట్. అలాగే… సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై మంత్రివర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వివిధ కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న చంద్రబాబు కేబినేట్…. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ కు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనపై చర్చించనుంది. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న చంద్రబాబు కేబినేట్… 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ విషయమై కెబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదనపై చర్చ ఉంటుంది.