జ‌గ‌న్ సైకోయిజం వైసీపీ కార్య‌క‌ర్తల‌కీ అంటుకుంది – నారా లోకేష్

-

జ‌గ‌న్ సైకోయిజం వైసీపీ కార్య‌క‌ర్తల‌కీ అంటుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్‌ అయ్యారు. జగన్‌ సర్కార్‌ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జ‌గ‌న్ సైకోయిజం వైసీపీ కార్య‌క‌ర్తల‌కీ అంటుకుందని ఫైర్‌ అయ్యారు. రాజ్యాంగ‌ వ్య‌వ‌స్థ‌ల విధ్వంసానికి పాల్ప‌డుతూ, ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్ష నేత‌ల్నే కాకుండా ప్ర‌జ‌ల్ని కూడా హింసిస్తూ సైకో జ‌గ‌న్ త‌న‌ శాడిజం చూపిస్తున్నాడన్నారు.

అధినేత చూపిన ఫ్యాక్ష‌న్ బాట‌లో వైసీపీ కేడ‌ర్ ప‌య‌నిస్తూ సామాన్యుల‌ని భ‌య‌భ్రాంతుల‌కి గురి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టుని నిర‌సిస్తూ శాంతియుత పోరాటం చేస్తున్న‌ భువనేశ్వరికి సంఘీభావం తెలుపుతూ నంద్యాల నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌ర‌కూ పాద‌యాత్ర‌గా వెళ్తోన్న నారాయ‌ణ అనే టిడిపి అభిమానిపై దాడి అమాన‌వీయమన్నారు. వృద్ధుడని చూడ‌కుండా దాడి చేశారంటే వీరు ముమ్మాటికీ వైసీపీ సైకోలే అంటూ మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version