చేతగాని సీఎం అవసరమా…వై ఏపీ నీడ్స్ జగన్? అని ఫైర్ అయ్యారు టీడీపీ అగ్ర నేత నారా లోకేష్. ఇది తుని నియోజకవర్గం పెరుమాళ్లపురంలో జగన్ సర్కారు ఫిష్ ఆంధ్ర పేరుతో ఏర్పాటుచేసిన చేపల దుకాణం అని… పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం చేతకాని జగన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. మత్స్యకారుల పొట్టగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని మండిపడ్డారు.
90 శాతం ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్లు ఫినిష్ అయ్యాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని చెప్పి అయిదేళ్ల పుణ్యకాలమూ పూర్తైపోయిందని ఆగ్రహించారు. నమ్మకద్రోహం, అబద్ధాలు, వంచనకు ప్యాంటు, షర్టు వేస్తే జగన్… ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఇటువంటి చేతగాని, చేవలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా… వై ఎపి నీడ్స్ జగన్?! అంటూ ఫైర్ అయ్యారు.