చంద్రబాబు తదుపరి స్టెప్ ఏమిటో ?

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో ఉండగా ఈ రోజు ఉదయం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేసినట్లు సిఐడి పోలీసులు వివరణ ఇచ్చారు. చంద్రబాబు పై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే గత కొద్దీ రోజుల నుండి చంద్రబాబు ను అరెస్ట్ చేయనున్నారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సైతం ఏక్షణం అయినా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతూ వచ్చాడు. ఆ క్షణం ఈ రోజు ఉదయమే అయింది… ఈయన మాట్లాడుతూ గతమ్లో ఎన్నో సార్లు నాపై ఎంక్వయిరీ లు వేసినా ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేకపోయారు..

కాగా ఇపుడు ఎంతో సంచలనాత్మకంగా అరెస్ట్ అయిన చంద్రబాబు కు ఏమీ తోచడం లేదని… ఈ పరిస్థితుల్లో తదుపరి ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news