జగనన్న స్ఫూర్తితో అంటూ మహిళలకి టోకరా వేసిన వ్యక్తి !

కృష్ణాజిల్లా కైకలూరులో కె బి ఫౌండేషన్ పేరుతో భార్యా భర్తలు ఇద్దరూ 150 మంది మహిళలకి టోకరా వేశారు. హైదరాబాద్ కు చెందిన బొడ్డు కిరణ్ కుమార్, సువర్చలాలు కలిసి కె బి ఫౌండేషన్ స్థాపించారు. జగనన్న స్పూర్తితో మీ కిరణ్ అన్న అనే బ్యానర్ తో మహిళలకు ఎరవేసిన కిరణ్ కుమార్ సుమారు 150 మంది మహిళలకి టోకరా వేశారని తెలుస్తోంది.

కైకలూరు లో శ్యామల అనే ఏజేంట్ ద్వారా 100 నుండి 150 మంది మహిళలని ఈ జంట మోసం చేసింది. 5 వేలు కడితే 50 వేలు,10 వేలు కడితే లక్ష ఇస్తామని చెప్పి లక్షల్లో వసూళ్లు చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా K B ఫౌండేషన్ స్థాపించిన బొడ్డు కిరణ్ కుమార్ గ్రామీణ ప్రాంతాల మహిళలే టార్గెట్ గా ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. కట్టిన డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని భావించి బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.