తిరుపతి లో పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదం

-

తిరుపతి లో పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా మనోజ్ గత కొద్ది రోజుల నుంచి తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో కుటుంబ పరమైన ఆస్తి పరమైన తగాదాలు కొనసాగుతున్నాయి. వారి మధ్య కలహాలు హైదరాబాద్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా కోర్టు మెట్లు ఎక్కిన విషయం విధితమే. గత రెండు నెలలుగా టీవీ సీరియల్ గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి.

మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలో తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారి తీసింది. తాజాగా మంచు మనోజ్ పోలీసులతో గొడవ పడ్డారు.  ఆ సమయంలో గెస్ట్ హౌస్ లో ఉన్నారు. తాను రీసార్ట్ లో ఉంటే ఎందుకు సైరన్ కొడుతున్నారని.. తనను అరెస్ట్ చేయడానికే వచ్చారు కదా అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ప్రైవసీని ఎందుకు ఎందుకు డిస్ట్రబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసుల వెంటే  బాకారావు పేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి హల్ చల్ సృష్టించారు. 

Read more RELATED
Recommended to you

Latest news