మంగళగిరి డీఎస్పీ ఎదుట మాజీ మంత్రి జోగి రమేష్ పోలీస్ విచారణ ముగిసింది. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమక్షంలో జోగి రమేష్ ను విచారించారు పోలీసులు. విచారణ అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మళ్లీ విచారణకు హాజరుకావాలని పోలీసులు అడగలేదు. పోలీసులు కోరితే విచారణకు హాజరవుతా అని తెలిపారు.
కానీ మంగళగిరి డీఎస్పీ మురళీ కృష్ణ మాత్ర ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను విచారించాం. కానీ కేసు దర్యాప్తుకు జోగి రమేష్ సహకరించడం లేదు అని ఆయన తెలిపారు. జోగి రమేష్ పోలీసులకు సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ కేసు లో దర్యాప్తులో భాగంగా జోగి రమేష్ ను మళ్లీ విచారణకు పిలుస్తాం. కేసుల్లో నిందితులు వాడిన ఎలక్ట్రానిక్ డివైస్ స్వాధీన పరుచుకునే అధికారం చట్టానికి ఉంది అని డీఎస్పీ మురళీ కృష్ణ పేర్కొన్నారు.