హోం శాఖ రివ్యూలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి అని పేర్కొన్నారు. విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళతా. రాష్ట్రంలో పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలి. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీలేదు అని ఏపీ సీఎం అన్నారు.
పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించాలి.. గంజాయి, డ్రగ్స్ తరిమేయాలి. ఏపీ పోలీసు శాఖ ప్రతిష్ట మళ్లీ నిలబెడదాం. ప్రజల భద్రతకు భరోసా ఇద్దాం. రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా, వాడకం విపరీతంగా పెరిగింది. డ్రోన్స్ ను వినియోగించి గంజాయి పంట ఎక్కడ ఉందో గుర్తించి నాశనం చేయాలి. సైబర్ క్రైంను ఎదుర్కోవడానికి నిపుణులతో చర్చించాలి. అవసరమైతే కొత్త చట్టాలు కూడా తీసుకొస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు.