వైసీపీ నేత సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు

-

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరికి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021 అక్టోబర్ 19న వైసీపీకి చెందిన కొందరూ టీడీపీ మంగళగిరి కేంద్ర కార్యాలయం పై దాడులకు పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఇప్పటికే పలువురు వైసీపీ విచారిస్తున్నారు పోలీసులు. 

ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం కూడా ఉందని గుర్తించిన పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటిే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయం పై దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాంలను ఇప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారణ చేపట్టారు. కేసు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో దాడి ఘటనలో ప్రమేయం ఉన్న నాయకులను విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా సజ్జలకు నోటీసులు పంపించారు. 

Read more RELATED
Recommended to you

Latest news