వర్షాలు, వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. జలదంకి మండలంలో అత్యధికంగా 23 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశముంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇటీవలే కురిసిన వర్షాలకు ఏపీ అతలకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ పరిస్థితి ఎలా అయిందో అందరికీ తెలిసిందే. అందుకే ముందస్తుగా చర్యలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉంటుందని ఆదేశించారు సీఎం చంద్రబాబు.