మూసీ పై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. మల్లన్న సాగర్,కొండపోచమ్మా,బస్వాపూర్ లో లాఠీ చార్జీ చేసి రైతులను భయపెట్టి ఊర్లు ఖాళీ చేయించారు అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మీ హాయంలో అనేక దాస్టికలు చేశారు. బస్వపూర్ 1 టీఎంసీ నుంచి 11 టీఎంసీ లకు అవసరం లేకున్నా పెంచారు. ఇప్పటికీ ఇంకా 5 వందల కోట్ల బకాయిలు పెట్టి పోయారు. మూసీ హైదరాబాద్, నల్గొండ ప్రజలందరి సమస్య. మూసీ DPR ఇంకా కాలేదు.. అప్పుడే తప్పుడు ప్రాజెక్టు ఎలా అయ్యింది.
మూసీ రివర్ బెడ్ లో నివాసం ఉన్న నిర్వాసితులు స్వయంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వెళ్ళారు తప్ప ఇండ్లు కూల్చలేదు. మూసీ పరివాహక ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి సీఎం పాదయాత్ర చేశారు. హైకోర్టు కూడా మూసీ పునర్జీవం తప్పక చేయాల్సిందే అని చెప్పింది. కాళేశ్వరం లో కొన్ని బ్లాక్ లు డిజైన్ లేకుండా కడితే.. పగుళ్లు వచ్చాయి. అప్పటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు తల దించుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్స్ రాలేదు.. ప్రజలు మిమ్మల్ని చీ కొట్టారు. దీక్ష దివస్ పేరుతో గొప్పగా ఉద్యమ చేశామని మళ్ళీ చెప్పుకొని ప్రజలను మగ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీక్ష దివాస్ దొంగ దీక్షలు లు చేస్తున్నారు అని భువనగిరి ఎమ్మెల్యే పేర్కొన్నారు.