డిమార్టు, రిలయన్స్ మార్టులలో తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం – మంత్రి నాదెండ్ల

-

డిమార్టు, రిలయన్స్ మార్టులలో తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం ఉంటాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌. కందిపప్పు, బియ్యం విక్రయాలు కౌంటర్లు ప్రారంభం అయ్యాయి. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు బజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ ఎపీఐఐసీ కాలనీలోని రైతు బజార్ లో కాసేపట్లో కౌంటర్ ను ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్.

Nadendla manohar

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండుగ అన్నారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్న దానిపైన పోరాటాలు చేసామని… రైతులకు చెల్లించాల్సిన 600 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామని ప్రకటన చేశారు. ధరల స్ధిరీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్యంగా రీటైలర్స్ తో సమీక్షించామని… 284 ఔట్ లెట్లు లో ఇవాళ కందిపప్పు, బియ్యం అందిస్తున్నామని వివరించారు. రోజుకు 391 మెట్రిక్ టన్నులు బియ్యం, 125 క్వింటాళ్ళ కందిపప్పు అందుబాటులో ఉంచాం… పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకు అందించడంలో పొరపాటు రాకుండా దాడులు చేస్తున్నామని తెలిపారు. డిమార్టు, ఉషోదయ, రిలయన్స్ లాంటి మార్టులలో కూడా రీటైల్ గా అందుబాటులో ఉంచుతామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news