పాక్‌కు వెళ్లేది లేదు.. ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌ వేదికలను మార్చండి : బీసీసీఐ

-

ఛాంపియన్స్‌ ట్రోఫీకి  పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటికే పాక్‌ క్రికెట్ బోర్డు ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించగా ఈ షెడ్యూల్‌కు బీసీసీఐ ఆమోదం తెలపలేదని సమాచారం. గత ఆసియా కప్‌ జరిగినట్లే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలనే ప్రతిపాదనలను ఐసీసీ ఎదుట బీసీసీఐ ఉంచినట్లు తెలిసింది.

ఇప్పటికే పాకిస్థాన్‌కు తమ జట్టును పంపించేది లేదని.. భారత్‌ ఆడే మ్యాచ్‌ల వేదికలను మార్చాల్సిందేనని బీసీసీఐ పట్టుబట్టినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. టోర్నీకి సంబంధించి ముసాయిదా షెడ్యూల్‌ను సిద్ధం చేసిన పాక్.. భారత్‌ ఆడే మ్యాచ్‌లకు పాక్‌ లాహోర్‌ స్టేడియాన్ని కేటాయించింది. టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ అక్కడే జరుగుతాయని పేర్కొంది. అయితే, భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో అసలు పాక్‌కే వెళ్లకూడదనే బీసీసీఐ నిర్ణయించింది. దీంతో భారత్ ఆడే వేదికలను శ్రీలంక లేదా దుబాయ్‌కు మార్చాలనే కండీషన్‌ను పెట్టింది. ఎనిమిది జట్లతో కూడిన ఈ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news