వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలి : మంత్రి గొట్టిపాటి రవి కుమార్

-

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే  విద్యుత్ శాఖ, ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తాజాగా సమీక్ష నిర్వహించారు.   ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు మంత్రి గొట్టిపాటి. విద్యుత్ స్థంభాలు, చెట్లు నెలకొరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రాంరంభించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి గొట్టిపాటి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.  లంక గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించారు మంత్రి. వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి చేసిన కీలక ఆదేశాలతో వరదలో చిక్కుకున్న ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామస్థులను సురక్షత ప్రాంతానికి తరలించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news