కొండ మీద అమ్మ వారు.. కొండ కింద కమ్మ వారు అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కమ్మ మహాసభల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ వారి పాత్ర కూడా కావాలి. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమల్ని ఆహ్వానిస్తుంది. మీలో ఉన్న నిపుణలను.. మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.
ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ మేము ఉన్నత స్థానాలకు రావటానికి ఉపయోగ పడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏ మాత్రం భయపడను. కమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారో పెద్దగా రీసెర్చ్ చెయ్యాల్సిన అవసరం లేదు సారవంతమైన నేల, సంవృద్ధిగా నీళ్లు ఎక్కడ వుంటాయే అక్కడ కమ్మ వాళ్ళు వుంటారు అది కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా సారవంతమైన నేలలు మంచి పంటలు పండించ గలిగిన, మంచి పంటలు పండుతాయి అని భూమి వున్న ప్రతి దగ్గర కమ్మ వాళ్ళు ఉంటారని తెలిపారు.