మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం

-

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడంతో ఇందులో తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ సమావేశంలో రాష్ట్రమంత్రి వర్గం మెగా డీఎస్సీకి ఆమోదం తెలిపింది. టెట్ పరీక్ష నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ వంటి రెండు ప్రతిపాదనలు ఈ భేటీలో తెరపైకి వచ్చాయి. వీటిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇవే కాకుండా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై ఈ క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news