చంద్రబాబు ను అరెస్ట్ చేయాలి – మంత్రి మేరుగ నాగార్జున

-

చంద్రబాబు ను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు మంత్రి మేరుగ నాగార్జున. దళితుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ను అరెస్ట్ చేయాలన్నారు. ఇవాళ గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ… గతం లో దళితుల పతకాల అమలు, మేము అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల పై బహిరంగ చర్చకు సిద్దమని పేర్కొన్నారు.

చంద్రబాబు అనే గజదొంగ చర్చకు రావాలని.. సంక్షేమ పథకాలు,అభివృద్ధి పతకాలు అందుకున్న ప్రతి పేద వాడి ఓటు వైసీపీ కి పడుతుందని వెల్లడించారు. ఈ నెల 28 న కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నామని…చంద్రబాబు, నుండి ఆనంద్ బాబు వరకు దొంగ ఓట్ల మాట ఎత్తితే వణికిపోతున్నారని పేర్కొన్నారు. దొంగ ఓట్ల తో గెలవాలని చూస్తే ప్రజా స్వామ్యం చూస్తూ ఊరుకోదని…చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. అందుకే పోలీసులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దాడులు చెపిస్తున్నారని… జగన్ అభివృద్ధి రధ చక్రాల కింద టిడిపి నలిగి పోవడం ఖాయమని స్పష్టం చేశారు. చంద్రబాబు కుయుక్తులను ప్రజలు నమ్మరని…చురకలు అంటించారు మంత్రి మేరుగ నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news