ఏపీలో రైతులు వరి పంట వేయద్దు – మంత్రి ధర్మాన ప్రసాదరావు

-

ఏపీలో రైతులు వరి వేయద్దని.. కమర్షియల్‌ పంటలకు అలవాటు కావాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం హిరమండలం రిజర్వాయర్ ను పరిశీలించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ సందర్భంగా.. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇప్పటి‌వరకూ సుమారు 2000 కొట్లు ఖర్చు చేసాం… ప్రోజెక్ట్ పూర్తి జరిగితే పొందాల్సిన ప్రయొజనాలు రైతులకు అందలేదని తెలిపారు.

ఒడిస్సా తో ఇబ్బందులు కొనసాగితున్నాయి… ట్రిబ్యునల్ పై ఒడిస్సా కొర్ట్ కు వెల్లనున్నట్లు సమాచారం ఉందని వెల్లడించారు. ప్రోజెక్ట్ అనుభవిస్తున్న మనకు ఉన్నంత శ్రద్ద ఒడిస్సాకు ఉండదని… అభ్యంతరాలు అన్నీ పూర్తి కావాలంటే మరో ఐదేళ్లు పడుతుందని అంచనావేస్తున్నామన్నారు. గొట్ట దగ్గర ఒక లిప్ట్ పెడ్టి మన హిరమండలం ప్రొజెక్ట్ నింపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నామని… ముఖ్యమంత్రు దృష్టికి తీసుకువెల్లాం ఆయన సానుకూలంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు.

గొట్టా వద్ద ఎత్తిపోతల పధకానికి 300, 350 కొట్లు అధనపు ఖర్చు అవుతుందని… ప్రోజెక్ట్ పూర్తి సామర్ధ్యం నిండాలంటే ఎత్తిపోతల అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. కృష్ణా, గోదారి జిల్లాలు అభివృద్దికి నీరే ప్రధానమని.. ఒడిస్సా తగాదా దురదృష్టకరం . వంశధార ప్రొజెక్ట్ ఎప్పుడో పూర్తి కావలసిందని చెప్పారు. వైసిపి హాయాంలోనే రైతులకు వంశధార ప్రొజెక్ట్ ద్వారా నీరు అందిస్తామని… వచ్చే వేసవి నాటికి 2లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version