కువైట్ లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు – మంత్రి కందుల దుర్గేష్

-

Minister Kandula Durgesh about kuwait : కువైట్ లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు మంత్రి కందుల దుర్గేష్. కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మీసాల ఈశ్వరుడు కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి కందుల దుర్గేష్. అనంతరం మీడియాతో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కువైట్లో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

Minister Kandula Durgesh about kuwait

సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయల చెక్కు అందజేస్తామని ప్రకటించారు. పీఎం నిధి నుంచి మరింత సాయం అందే విధంగా చూసి కుటుంబానికి అండగా నిలబడతామని వివరించారు. ఉపాధి కోసం దేశం కానీ దేశం వెళ్లి మనవారు ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది..అందరూ బాగుండేలా చూసుకుంటామని ప్రకటించారు మంత్రి కందుల దుర్గేష్.

Read more RELATED
Recommended to you

Latest news